Andhra news: ఏపీలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 09 Jun 2024 21:18 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్‌13న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా..  ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని