Palnadu: ఈవీఎం ధ్వంసం ఘటన.. అడుగడుగునా అధికారుల వైఫల్యం

పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి అడుగడుగునా అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

Published : 22 May 2024 15:35 IST

అమరావతి: ఎన్నికల రోజు పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి అడుగడుగునా అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన ఘటనలో ప్రిసైడింగ్‌ అధికారి నుంచి సీఈవో దాకా అన్ని స్థాయిల్లోని అధికారులు విఫలం చెందారన్న వాదన వ్యక్తమవుతోంది. 

ఈవీఎం ధ్వంసం ఘటనపై ఎన్నికల యంత్రాంగం బాధ్యత మరచిందని, ఎమ్మెల్యే దుశ్చర్యల్ని ఏ స్థాయిలోనూ అధికారులు పరిశీలించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలు ధ్వంసం చేసి, పౌరులపై వైకాపా అనుచరులు దాడులు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదని, ఈసీ ప్రతిస్పందించే వరకూ అధికారుల్లో చలనం లేని పరిస్థితి కనిపించిందన్న వాదన పౌరసమాజం నుంచి వ్యక్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశంతో చర్యలకు ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉపక్రమించారన్న వాదన వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని