తవ్వకాల్లో బయల్పడిన 505 బంగారు నాణేలు

తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 1.716 కిలోల బరువున్న 505 బంగారు నాణాలు లభించాయి.

Updated : 27 Feb 2020 20:37 IST

తిరుచిరాపల్లి (తమిళనాడు): తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 1.716 కిలోల బరువున్న 505 బంగారు నాణెములు లభించాయి. ఇక్కడి తిరువనైకావల్‌లో ఉన్న జంబుకేశ్వరర్‌ దేవాలయంలో బుధవారం ఈ సంపద బయటపడింది. దొరికిన సంపదలో 504 నాణాలు చిన్నవి కాగా, ఒకటి పెద్దదని ఆలయ అధికారులు తెలిపారు. వీటిని క్రీ.శ. 1000 నుంచి 1200 కు చెందినవిగా భావిస్తున్నారు. దేవాలయం పరిసరాల్లో తవ్వకాలు జరుపుతుండగా ఏడు అడుగుల లోతులో ఓ మట్టి పాత్రలో ఈ నాణెములు లభించాయి. పాత్రతో సహా బంగారు నాణెములను పోలీసులకు అప్పగించినట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వీటిని ప్రభుత్వ ట్రెజరీకి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని