Sheshadri Express: శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్‌ వద్ద ఏసీ కోచ్‌కు ‘హాట్‌ యాక్సిల్‌’ అయ్యింది.

Updated : 21 Mar 2023 11:29 IST

బిట్రగుంట: శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్‌ వద్ద ఏసీ కోచ్‌కు ‘హాట్‌ యాక్సిల్‌’ అయ్యింది.  రైల్వే సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని గుర్తించి.. ఆ బోగీని తొలగించారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో బిట్రగుంట స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది.  తిరిగి ఉదయం 4 గంటల తర్వాత రైలు బెంగళూరుకు బయల్దేరింది. మరమ్మతుకు గురైన ఏసీ బోగీలోని కొందరు ప్రయాణికులను పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని