గొప్పలు చెప్పి.. నిరాశ పరిచి!

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కేజీబీవీల్లో ఫలితాలు మరింతపడిపోయాయి. ప్రభుత్వం పాఠశాల, కళాశాల విద్యను బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా ఈ ఏడాది ఫలితాలు చూస్తే ఏ మాత్రం చేస్తుందో పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది.

Updated : 13 Apr 2024 05:21 IST

ఇంటర్‌ ఫలితాల్లో వెనుకంజ
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
కంభం, యర్రగొండపాలెం, పొదిలి, పెద్దారవీడు, పెద్దదోర్నాల కొనకనమిట్ల, న్యూస్‌టుడే

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కేజీబీవీల్లో ఫలితాలు మరింతపడిపోయాయి. ప్రభుత్వం పాఠశాల, కళాశాల విద్యను బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా ఈ ఏడాది ఫలితాలు చూస్తే ఏ మాత్రం చేస్తుందో పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. గతంలో కన్నా ఫలితాలు తగ్గడంతో ప్రభుత్వ కళాశాలల విద్య పట్ల తల్లిదండ్రులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రకటనలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఫలితాలు రాబట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో తురిమెళ్ల కళాశాల 85.22 ద్వితీయ స్థానంలో, అర్థవీడు కళాశాల 83.33 శాతంతో మూడోస్థానంలో నిలిచింది. తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన కళాశాలల్లో యర్రగొండపాలెం 29శాతం, కొమరోలు 30.95 శాతంమంది ఉత్తీర్ణ సాధించారు. జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో తురిమెళ్ల ప్రభుత్వ కళాశాల 56.72 శాతంతో ప్రథమ స్థానాల్లో నిలిస్తే, చివరి స్థానంలో యర్రగొండపాలెం జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు 16.04 శాతంతో నిలిచారు.

ఉపాధ్యాయులు కొరత: కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు కాస్తుర్బా గాంధీ విద్యాలయం 14 మంది కాను 10 మంది విద్యార్థులు పాస్‌ కాలేదు. తరగతులు సరైన సమయంలో ప్రారంభం కాకపోవడంతో పాటు తరగతి భోధన సిబ్బంది లేకపోవడంతో పాస్‌ కాలేదు. వెలిగొండ గురుకుల కళాశాల 36 మంది 12 మంది విద్యార్థులు పాస్‌ కాలేదు. బోధన సిబ్బంది కొరత వల్ల తరగతులు సక్రమంగా నిర్వహించపోవడంతో విద్యార్థులు పాస్‌ కాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

తగ్గిన ఉత్తీర్ణత : ప్రభుత్వ పనితీరు అధికారుల నిర్లక్ష్యంతో యర్రగొండపాలెం మండలంలో ఇంటర్‌లో ఉత్తీర్ణశాతం తగ్గిపోయింది. వినుకొండరోడ్డులోని కస్తూర్బాగాంధీ బాలికల కళాశాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 28 మంది బాలికలు పరీక్షలు రాయగా అందులో 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 11 మంది పరీక్షలు రాయగా 9మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో మొదటి సంవత్సరంలో 160 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే  వారిలో కేవలం  17 మంది పాసయ్యారు.. 100 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తే. 29మంది ఉత్తీర్ణులయ్యారు.

మార్కాపురం, కొమరోలు గ్రామీణం : మార్కాపురం లోని ఆదర్శ, గురుకుల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది.

  • కొమరోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు 32 శాతం ఉత్తీర్ణత సాధించారు.
  • కంభంలో మొదటి సంవత్సరం ఫలితాల్లో 28.3 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ ఏడాది విద్యార్థులు 89 మంది పరీక్ష రాయగా, 39 మంది ఉత్తీర్ణులయ్యారు.‌
  • పెద్దారవీడులోని కేజీబీవీలో ద్వితీయ సంవత్సరంలో ఏడు మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా ఇద్దరు ఉత్తీర్ణత సాధించగా, ఐదు మంది గణితంలో ఫెయిల్‌ అయ్యారు.


పెద్దారవీడు కేజీబీవీలో సున్నా

పెద్దారవీడు కేజీబీవీల్లో జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదు. అయితే రాచర్ల కేజీబీవీల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

  • పొదిలి కేజీబీవీలో ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 13 మందికి గాను ఒక్కరు, ఏడు శాతం, ద్వితీయ సంవత్సరం ఐదు మందికి గాను ముగ్గురు 60 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రత్యేకాధికారి ఎన్‌.అనూరాధ తెలిపారు.
  • దోర్నాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఎంపీసీˆ గ్రూపులో రెండో సంవత్సరంలో 17 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా ముగ్గురు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 11 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఐదు మంది పాసయ్యారు. విద్యాలయంలో గణితం బోధించే అధ్యాపకుడు లేకపోవడంతో ఉత్తీర్ణత శాతం తగ్గింది.

తగ్గడానికి కారణాలు

యర్రగొండపాలెం కళాశాలలో రెగ్యులర్‌ బోధకులు లేకపోవడం,  పోస్టుల భర్తీ నిలిచిపోవడంతో ఉత్తీర్ణతపై ప్రభావం చూపింది. గంటల లెక్కన వేతనం చెల్లించి అతిథి అధ్యాపకులకు చదువు చెప్పించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోయాం సిలబస్‌ సకాలంలో పూర్తికాక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

పుస్తకాలు.. మధ్యాహ్న భోజనం లేకపోవడమే..

ఇంటర్మీడియేట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడానికి ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు సరఫరా చేయకపోవడమేనని, మధ్యాహ్న భోజనం పంపిణీ చేయకపోవడమే కారణమని అధ్యాపకులు, విద్యావేత్తలు చెబుతున్నారు. సర్కారీ కళాశాలలో చదివే వారిలో ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉన్నారు. వారికి పుస్తకాలు కొనే ఆర్థిక వెసులుబాటు లేకపోవడం. వైకాపా ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు. దీంతో పల్లెల నుంచి వచ్చే విద్యార్థులకు ఆకలి బాధలు తాళలేక ఒకపూట తరగతులకు హాజరై మధ్యాహ్నం నుంచి ఇళ్లకు వెళ్లడంతో తరగతులు సరిగా వినకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపిందని వారు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని