NRI Yashasvi: యశస్వికి పాస్‌పోర్టు ఇచ్చేయండి.. CIDకి ఏపీ హైకోర్టు ఆదేశం

ఎన్నారై యశస్వి (NRI Yashasvi) పాస్‌పోర్టును రిలీజ్‌ చేయాలని సీఐడీని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Updated : 26 Dec 2023 13:50 IST

అమరావతి: ఎన్నారై యశస్వి (NRI Yashasvi) పాస్‌పోర్టును రిలీజ్‌ చేయాలని సీఐడీని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేసి 41ఏ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో యశస్వి పాస్‌పోర్టును సీఐడీ (CID) స్వాధీనం చేసుకుంది. దీంతో తన పాస్‌పోర్టును ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో యశస్వి పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం యశస్వి పాస్‌పోర్టు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని