Harish rao: తెలంగాణలో అందుబాటులోకి 134 ఉచిత వైద్య పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 134 ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా అందించే ఈ వైద్య పరీక్షలను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా ప్రారంభించారు.

Updated : 01 Jul 2023 12:53 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 134 ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా అందించే ఈ వైద్య పరీక్షలను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నొస్టిక్స్‌ సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లను అందుబాటులోకి వచ్చాయి. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఉచితంగా చేస్తున్నారు. మరో 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చాం. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి, వైద్యుల మొబైల్‌కు పంపిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కాన్‌, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు చాలా కష్టపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రులకు దీటుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేసీఆర్‌ కిట్, గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ అందిస్తోంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70శాతం అవుతున్నాయి. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం’’ అని హరీశ్‌రావు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని