యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి 3 గంటల సమయం

వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

Updated : 25 May 2024 13:36 IST

యాదగిరిగుట్ట: వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షిస్తున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని