Summer: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. రేణిగుంటలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రజలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Updated : 21 Apr 2024 18:49 IST

అమరావతి: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2, కడప జిల్లా బలపనూరులో 43.8, అనకాపల్లి జిల్లా రావికమతంలో 43.8, పల్నాడు జిల్లా రావిపాడులో 43.8, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.7, పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 43.6, విజయనగరం జిల్లా ధర్మవరంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా  36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని