ఆయన సరదా.. కొలంబియా కొంప ముంచుతోంది!
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు కొలంబియాలో ఆయనో పెద్ద డ్రగ్స్ మాఫియా కింగ్.. సరదాగా నాలుగు నీటి ఏనుగులను పెంచుకున్నాడు. అప్పుడంతా బాగానే ఉంది. కానీ, ఆయన మృతి చెందిన తర్వాత ఆ నాలుగు నీటి ఏనుగుల్ని ఎవరూ పట్టించుకోలేదు. అవే ఇప్పుడు కొలంబియా వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారాయి. ఆ నీటి ఏనుగుల సంతానం ప్రస్తుతం కొలంబియా వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తున్నాయి.
పాబ్లో ఎస్కోబార్.. 1980ల్లో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాకి డాన్‌గా ఎదిగాడు. అవినీతి డబ్బులే అయినా.. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా అతడికి పేరుంది. ఆయన కుమార్తె చలికాచుకోవడం కోసం కరెన్సీ నోట్ల కట్టలతో మంట పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు పాబ్లో ఎంత సంపన్నుడో. అయితే, ఓ సారి అమెరికా జూ నుంచి నాలుగు నీటి ఏనుగుల్ని తెప్పించుకున్నాడు. ఆంటియోక్వియాలోని ప్యూర్టో ట్రియూన్ఫోలో ఉన్న తన విలాసవంతమైన హాసియండా నెపోల్స్ ఎస్టేట్‌కి తీసుకెళ్లి పెంచుకున్నాడు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న పాబ్లోను పట్టుకునేందుకు పోలీసు బలగాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఎట్టకేలకు పోలీసులు 1993లో పాబ్లోను కనిపెట్టి కాల్చి చంపారు. దీంతో డ్రగ్స్ మాఫియా అంతమైంది. పాబ్లో నివాసాల్లో ఉన్న అనేక వస్తువులు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎస్టేట్‌లోనే ఉన్న నీటి ఏనుగుల్ని ఏం చేయాలో తెలియక అలాగే వదిలేశారు.
ఎవరూ కన్నెత్తి చూడని ఆ ఎస్టేట్‌లో ఆ నాలుగు నీటి ఏనుగులు మాత్రమే నివసించేవి. 2007 నాటికి వాటి సంఖ్య 16కి చేరింది. అక్కడ ఆహారం దొరక్క జనావాసంలోకి రావడం, మనుషులపై దాడి చేయడం మొదలుపెట్టాయి. కొన్ని అడవుల్లోకి, మరికొన్ని ఇతర ప్రాంతాలకు పారిపోయి సంతానోత్పత్తిని పెంచాయి. దీంతో కొలంబియా వ్యాప్తంగా ప్రస్తుతం వీటి సంఖ్య 100 వరకు ఉంటుందని అంచనా. అయితే, వీటి వల్ల స్థానిక పర్యావరణానికి, వృక్ష, జంతు జాలానికి ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. నీటి ఏనుగుల వల్ల వన్యప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయని, నది.. చెరువుల్లో దిగి నీటిని కాలుష్యం చేస్తున్నాయని తెలిపారు. వీటి మలంలో ఉండే విషపూరిత పదార్థాలు నీటిలో ఉండే చేపలకు ప్రాణసంకటంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఏనుగుల సంఖ్య ఇప్పుడు నియంత్రించకపోతే 2039 నాటికి వాటి సంఖ్య 1,400కి చేరుతుందని, అప్పుడు వాటిని నియంత్రించడం కష్టమని పేర్కొన్నారు. మరోవైపు వీటి సంఖ్య తగ్గించి, కొన్నింటిని మరో ప్రాంతానికి తరలించాలని స్థానిక అధికారులు యోచిస్తుంటే.. జంతు ప్రేమికులు మాత్రం అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి నీటి ఏనుగుల బెడద కొలంబియాకు తప్పుతుందో లేదో.. వేచి చూడాలి!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్