Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. 7వేల మంది పోలీసులతో బందోబస్తు

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు సీపీ రామకృష్ణ తెలిపారు.

Updated : 11 Jun 2024 17:54 IST

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. కేసరపల్లిలోని ఐటీటవర్‌ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తుండటంతో దాదాపు ఏడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్‌లు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. నగరంలో వీఐపీలు బసచేసే హోటల్స్‌ వద్ద  ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్‌ జిల్లా సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులు.. కార్యకర్తలు విజయవాడ చేరుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈరోజు రాత్రికే విజయవాడ చేరుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని