హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్‌ క్యూ రూట్’ పోర్టల్‌

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌ కొత్త పోర్టల్‌ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Published : 30 Nov 2023 01:57 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections 2023) సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేసే క్యూ లైన్‌ వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ వినూత్న చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయన ‘పోల్‌ క్యూ రూట్‌’ అనే ప్రత్యేక పోర్టల్‌ను ఓటర్లకు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా ఈ పోర్టల్‌ సేవలు పొందొచ్చు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ఓపెన్‌ చేసి అందులో పోల్‌ క్యూ లైన్‌ పోర్టల్‌ సెలెక్ట్ చేయాలి. తర్వాత నియోకవర్గం, పోలింగ్ స్టేషన్‌ను వివరాలను నమోదు చేసి కింద ఉన్న సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే..లైన్‌లో వేచి ఉండాల్సిన సమయాన్ని చూపిస్తుంది. ఈ వివరాలను సంబంధిత అధికారి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారని రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఓటర్లకు మాత్రమే ఈ పోర్టల్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని