ఇంకెన్ని వెబ్‌సిరీస్‌లు విడుదల అవుతాయో..! పిన్నెల్లిపై పేలుతున్న ట్రోల్స్‌

పోలింగ్‌ రోజు ఈవీఎంలు పగలగొట్టి, హింసకు దిగి ఆ తర్వాత పరారైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ పేలుతున్నాయి.

Updated : 23 May 2024 10:20 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగ్‌ రోజు ఈవీఎంలు పగలగొట్టి, హింసకు దిగి ఆ తర్వాత పరారైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ పేలుతున్నాయి. ‘నేను నేరుగా చెబుతున్నాను.. నాకు మాచర్లకు రావాలంటే 2 గంటలు అన్నోడు 2 కార్లు మార్చి ఎందుకు పారిపోయాడు..?’ అని ఎద్దేవా చేస్తున్నారు. ‘పులిరా.. పులిరా పెద్ద పులిరా.. ఈవీఎంలు పగలగొట్టి పారిపోయేరా..’ అని వ్యంగాస్త్రాలు విసురుతున్నారు. ‘జూన్‌ 4 వరకు ఎలా కాలక్షేపం అవుతుందా అనుకున్నాం. తస్సాదియ్యా ఏం కథ మొదలు పెట్టిర్రుపో’ అంటూ పిన్నెల్లి ఎపిసోడ్‌లపై జోకులు వేసుకుంటున్నారు. కొన్ని మీమ్స్‌లో రాష్ట్ర పరిస్థితులనూ వివరిస్తూ పిన్నెల్లిపై చురకలు వేస్తున్నారు.

  • 2 గంటల్లో వచ్చేవాడే కానీ, రోడ్లు బాలేక ఆలస్యమై ఉంటుంది!
  • మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి మంచివాడు అని సీఎం జగన్‌ చెబితే ఏమో అనుకున్నాం. కానీ, మరీ ఈవీఎంలు పగలగొట్టేంత మంచివాడనుకోలేదు.
  • ఇంత బతుకు బతికి బాత్రూం కమోడ్‌లు తయారుచేసే కంపెనీలో దాక్కోవడమేంట్రా బుజ్జీ.
  • ఏలేవాడు మనోడైతే ఎన్నేషాలైనా వేయొచ్చు.
  • ఇప్పుడే ఇలా ఉంటే ఫలితాలు వచ్చాక ఇంకెన్ని వెబ్‌సిరీస్‌లు విడుదల అవుతాయో! అని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని