Watch: నుదుటితో 273 వాల్‌నట్స్‌ ఫటాఫట్‌.. పాకిస్థానీ రికార్డు చెరిపేసిన మనోడు!

Viral Video: నుదుటితో కేవలం 60 సెకన్లలో 273 వాల్‌నట్స్‌ను పగులగొట్టాడు మన దేశానికి చెందిన నవీన్‌ కుమార్‌. గతంలో పాక్‌ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.

Published : 06 Aug 2023 02:20 IST

Guinness World Records

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా మనం ఒక్క వాల్‌నట్‌ పగులగొట్టడానికే నానా యాతనా పడుతుంటాం. అలాంటిది ఏకంగా 273 వాల్‌నట్స్‌ను.. అదీ కేవలం 60 సెకన్లలో పగులగొట్టడం అంటే మాటలా? పైగా అదీ నుదుటితో! వామ్మో రికార్డు మాట పక్కనపెడితే నెత్తి పగిలిపోదూ!! అలాంటి క్లిష్టమైన రికార్డును సుసాధ్యం చేశాడు మన దేశానికి చెందిన నవీన్‌. గతంలో పాక్‌కు చెందిన వ్యక్తి పేరిట ఉన్న రికార్డును చెరిపేసి గిన్నిస్‌ బుక్‌ రికార్డును ఒడిసిపట్టాడు.

ఇమ్రాన్‌ అరెస్ట్‌.. ఏమిటీ తోషఖానా స్కామ్‌?

పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ రషీద్‌ గతంలో నిమిషంలో 254 వాల్‌నట్స్‌ను నుదుటితో పగులగొట్టి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించాడు. తాజాగా మన దేశానికి చెందిన ఎస్‌ నవీన్‌ కుమార్‌ ఆ రికార్డును తిరగరాశాడు. వరుసగా టేబుళ్లపై ఉంచిన 273 వాల్‌నట్స్‌ను కేవలం 60 సెకన్లలో పగులగొట్టి కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ విషయంలో 2017 నుంచి శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలో ఇటలీలో ఒకే వేదికపైగా రషీద్‌తో నవీన్‌ తలపడ్డాడు. అప్పుడు 239 వాల్‌నట్స్‌ మాత్రమే పగులగొట్టాడు. దీంతో వెనకబడిపోయాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత రషీద్‌ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. దీనికి సంబంధించిన వీడియో గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్స్‌ తన ట్విటర్‌ పేజీలో తాజాగా పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని