‘మాతో మాకే పోటీ’.. యూఎస్‌లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెకీ వీడియో వైరల్

Viral news: అమెరికాలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 12 Jun 2024 00:07 IST

Viral news | ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ సంస్థలో లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి పంపాయి. జాబ్‌ కోల్పోయినవారిలో చాలామంది సోషల్‌మీడియా వేదికగా తమ బాధను పంచుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా అమెరికాలోని భారత సంతతికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా ఇలానే ఓ వీడియోను నెట్టింట పోస్ట్‌ చేశాడు. ఉద్యోగం నుంచి తొలగించడానికి కంపెనీ చెప్పిన కారణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. తనతో పాటు తన టీమ్‌ మొత్తాన్ని తొలగించారని పేర్కొన్నాడు.

‘‘ఉద్యోగం నుంచి తొలగించే ముందు నన్ను ఇంటర్వ్యూ చేశారు. నా టీమ్‌ సభ్యుల స్థానాల్ని భారతీయులతో భర్తీ చేస్తామని చెప్పారు. అది విని షాకయ్యా. ‘నేనూ భారతీయుడినే’ అని చెప్పా. కానీ వాళ్లకు ఇండియా నుంచి వచ్చే భారతీయులే కావాలంట. వారు తక్కువ జీతంకే పని చేస్తారని కంపెనీ చెప్పింది. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు’’ అంటూ తన వీడియోలో పేర్కొన్నాడు. తాను పుట్టింది ఇండియాలోనే అయినప్పటికీ.. తనకు రెండేళ్లున్నప్పుడు కుటుంబంతో పాటు అమెరికా వచ్చినట్లు తెలిపాడు. 

‘క్విక్‌’ ఫోకస్‌.. బ్లింకిట్‌లో జొమాటో రూ.300 కోట్ల పెట్టుబడి

ఉద్యోగం కోల్పోవడం, తన ఉద్యోగాన్ని భారతీయులకే ఇవ్వడం గురించి అతడు చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 30 లక్షల మంది వీక్షించారు. దీనిపై కొందరు సరదాగా పోస్టులు పెడుతున్నారు. ‘బహుశా నువ్వు ఖరీదైపోయి ఉంటావ్‌ బ్రో’ అంటూ ఓ యూజర్‌ రాసుకొచ్చాడు. ‘భారతీయుడి తరహాలో ఇంగ్లిష్‌ మాట్లాడి మళ్లీ ఉద్యోగంలో చేరిపో’ అంటూ మరొకరు సలహా ఇచ్చారు. ‘స్టాండప్‌ కమెడియన్‌గా మంచి భవిష్యత్‌ ఉంది ట్రై చేయొచ్చు కదా!’ అంటూ మరో యూజర్‌ ఫన్నీగా కామెంట్ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు