‘క్విక్‌’ ఫోకస్‌.. బ్లింకిట్‌లో జొమాటో రూ.300 కోట్ల పెట్టుబడి

Zomato: క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌లో రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు జొమాటో సిద్ధమైంది.

Published : 11 Jun 2024 19:02 IST

Zomato | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో (zomato).. తన క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ (Blinkit)లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే స్విగ్గీ, జెప్టో నుంచి పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. అందులోభాగంగా రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుందని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. 

2022 ఆగస్టులో జొమాటో రూ.4,477 కోట్లకు బ్లింకిట్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. ఇప్పటివరకు రూ.2,300 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. బ్లింకిట్‌తో పాటు తన అనుబంధ సంస్థ జొమాటో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.100 కోట్లు పెట్టింది. ఈ సంస్థ లైవ్‌ ఈవెంట్‌లు, టికెటింగ్‌లను నిర్వహిస్తుంది. స్విగ్గీ తీసుకొచ్చిన ఇన్‌స్టామార్ట్‌, జెప్టో నుంచి బ్లింకిట్‌ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో మరోసారి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం గమనార్హం.

ఇక ఐఫోన్స్‌లో చాట్‌జీపీటీ.. iOS 18లో పలు కొత్త ఫీచర్లు

ఓవైపు స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.10,414 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. మరోవైపు జెప్టో 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,500 కోట్లు) సమీకరించడానికి చర్చలు జరుపుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో బ్లింకిట్‌ ఆదాయం రూ.1,064 కోట్లుగా ఉంది. 2024లో ఆ ఆదాయం రూ.2,302 కోట్లకు చేరింది. ప్రస్తుతం నిత్యావసర వస్తువులు డెలివరీ చేస్తున్న సంస్థ.. త్వరలో దుస్తులు, గృహాలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్స్‌, స్పోర్ట్స్‌ వస్తువులు, గృహోపకరణాలను చేర్చాలని చూస్తోంది. ఇప్పటికే ఫుడ్‌ డెలివరీ విభాగాన్ని బ్లింకిట్‌ అధిగమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని