TS News: తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 12 Feb 2024 21:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు. పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐఏఎస్‌ ఇంటి వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌ను నియమించారు.

బదిలీ అయిన వారి వివరాలివే.. 

  • రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి
  • రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు
  • సైబరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా జోయల్‌ డేవిస్‌
  • సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్‌
  • ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా అపూర్వరావు
  • సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా ఉదయ్‌ కుమార్‌
  • ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా గిరిధర్‌
  • హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ
  • మల్టీజోన్‌-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు బదిలీ (ఇటీవలే రాచకొండ కమిషనర్‌గా వెళ్లిన సుధీర్‌బాబు)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని