Published : 10 Feb 2021 01:15 IST

జపనీయుల స్నానం.. ఆచరణ విభిన్నం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసిన తర్వాతే మన దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తాం. కొంతమంది మాత్రమే రాత్రుళ్లు స్నానం చేస్తుంటారు. కానీ. జపాన్‌లో రోజువారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ స్నానాలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. ఇందుకు ప్రాచీన సంప్రదాయంతోపాటు.. ఆధునిక జీవనశైలి కూడా కారణమని చెబుతున్నారు.

జపనీయులు చర్మసౌందర్యానికి అధిక ప్రాధాన్యమిస్తారు. అందుకే స్నానం చేశామా అంటే చేశాం అన్నట్లు కాకుండా ఆస్వాదిస్తూ చేస్తారు. మొదట షవర్‌ నీళ్లతో శరీరంపై ఉండే దుమ్ముధూళిని కడిగేస్తారు. బాత్‌టబ్‌లో 40డిగ్రీల ఉష్ణోగ్రతకు మించకుండా వేడినీటిని నింపుతారు. చర్మం ఆరోగ్యంగా ఉండటం కోసం కొందరు వనమూలికలను నీళ్లలో కలుపుతారు. అలా బాత్‌టబ్‌లో స్నానం చేస్తూ శారీరానికి, మెదడుకు విశ్రాంతినిస్తారు.

సాయంత్రం వేళే ఎందుకు??

జపాన్‌లో ప్రజలు పనిరాక్షసులని అందరికి తెలిసిందే. చాలా మంది ఆఫీసుల్లో పనివేళలకు మించి అదనంగా పనిచేస్తుంటారు. మరికొందరు రెండేసి ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి సమయానికి కార్యాలయాలకు చేరుకోవడం.. పనులు పూర్తి చేయడం ఎంతో ముఖ్యం. కాస్త ఆలస్యమైనా ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఉదయం పూట స్నానం చేస్తే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వారు ఉదయం కాకుండా సాయంత్రం వేళ స్నానం చేస్తుంటారు. 

మరో కారణమేంటంటే.. జపాన్‌లో అత్యధిక మంది సొంత వాహనాలు కాకుండా ప్రజారవాణా వాహనాలపైనే ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో కిక్కిరిసి వెళ్లాల్సి ఉంటుంది. రోజంతా ఎండలో, ఆఫీసులో కష్టపడటం మూలంగా చెమట పట్టి.. అలసిపోయి శరీరం అధ్వాన్నంగా తయారైపోతుంది. అందుకే పనులన్నీ పూర్తి చేసుకొని సంధ్యవేళ తీరిగ్గా స్నానం చేస్తారు. ఎండకాలంలో ఉక్కపోతను తట్టుకోలేక చల్లటి నీళ్లతో, చలికాలంలో చలి నుంచి తప్పించుకోవడం కోసం వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు.

బహిరంగ స్నానాల సంప్రదాయం

జపాన్‌లో బహిరంగ స్నానాల సంప్రదాయం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వేడినీళ్ల బుడగలు, గుంటల్లో స్నానాలు చేయడానికి వసతులుంటాయి. దీంతో ప్రజలు సాయంత్రం వేళ సరదాగా కుటుంబంతోసహా అక్కడికి వెళ్లి స్నానాలు చేస్తుంటారు. ఏటా సామూహిక స్నానాల పోటీలు కూడా నిర్వహించడం విశేషం. 

ఇవీ చదవండి..

నిద్రపోయే ముందు వీటికి దూరం!

జపాన్‌లో ‘అలా’ మాట్లాడితే వింతగా చూస్తారట!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని