కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావు బెయిల్‌ పిటిషన్ తిరస్కరణ

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 

Published : 01 Apr 2024 23:14 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన భూకబ్జా, ఆయుధాల వినియోగం కేసులో ముందస్తు బెయిల్ కోసం కన్నారావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్‌ను గతంలోనే హైకోర్టు కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని