KCR : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్‌ డిశ్చార్జ్‌

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసానికి ఆయన వెళ్లారు.

Updated : 15 Dec 2023 12:34 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసానికి ఆయన వెళ్లారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటి భాగంలో తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆయన కోలుకోవడంతో నేడు ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని