KCR: మహేశ్వరానికి వైద్య కళాశాల మంజూరు చేస్తాం: సీఎం కేసీఆర్‌

పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్‌ నేతలని సీఎం కేసీఆర్ అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారని గుర్తుచేశారు. ప్రజలకు తాగు, సాగునీరు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమని కేసీఆర్‌ విమర్శించారు.

Updated : 19 Jun 2023 14:44 IST

తుమ్మలూరు: రాష్ట్రంలో పచ్చదనం పెరిగేందుకు 8 ఏళ్లుగా కృషి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులు వేశారని.. ఇప్పుడు అదే కార్యక్రమంతో తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్మలూరులో ఏర్పాటు చేసిన హరితోత్సవ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.

‘‘పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్‌ నేతలు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారు. ప్రజలకు తాగు, సాగునీరు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణం. ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో నీటికష్టాలు తీరిపోతాయి. ‘వానలు వాపసు రావాలె.. కోతులు వాపసు పోవాలె..’ పాట రాశాను. అడవులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం. ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీకి ₹100కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. మహేశ్వరానికి వైద్య కళాశాల మంజూరు చేస్తాం. బీహెచ్‌ఈఎల్‌ నుంచి మహేశ్వరంలోని కందుకూరు వరకు మెట్రో తెచ్చేందుకు కృషి చేస్తాను. వరి ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించినవారు ఏడో స్థానానికి పోయారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని సంక్షేమ పథకాలు మీరు చూస్తున్నారు. తుమ్మలూరుకు రూ.కోటితో కమ్యూనిటీ హాల్‌ మంజూరు చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్‌కు దశాబ్ది పేరు పెట్టాలని కోరుతున్నాను. జల్‌పల్లి, తుక్కుగూడకు చెరో రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. బడంగ్‌పేట పురపాలికకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాను. అటవీశాఖ అధికారులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటాం. సొంత పిల్లలను పెంచినట్లు మొక్కలను సాకాలి’’ అని సీఎం కేసీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు