Amaravati: జూన్‌ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటాం: జీఏడీ

జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది.

Published : 30 May 2024 18:48 IST

అమరావతి: జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వశాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఆ లోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడీ ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని