KRMB: ఏపీ, తెలంగాణకు సాగర్‌ నీటి విడుదలపై కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. 

Published : 18 Apr 2024 15:25 IST

హైదరాబాద్‌: వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉంది. అందులో ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన నీరు హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగానికి తెలంగాణకు అనుమతిచ్చారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే నీటిని వినియోగించుకోవాలని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని