KTR: ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్‌

దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని.. దశాబ్దం గడిచిన సందర్భమిదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా తెలిపారు.

Published : 02 Jun 2024 11:16 IST

హైదరాబాద్‌: దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని.. దశాబ్దం గడిచిన సందర్భమిదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పేర్కొన్నారు. ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటం తెలంగాణ ఉద్యమం అని అభివర్ణించారు. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిదని చెప్పారు. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదన్నారు.  

‘‘అన్ని వర్గాలు కొట్లాడి, పోట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిది. 60 ఏళ్ల విధ్వంస గాయాలను పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మనది. పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా ఈ దశాబ్ద ప్రయాణం అనితర సాధ్యంగా సాగింది. శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలను మన తెలంగాణ పదేళ్లలో చేసి చూపింది. నాడు కరవు, రాళ్లురప్పలు, కల్లోలిత తెలంగాణ.. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ. ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని