Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం 

బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు

Updated : 11 Jul 2021 13:55 IST

అమరావతి: బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణిగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావం వల్ల ఇవాళ, రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. జాలర్లు ఎల్లుండి వరకు వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గన్నవరం పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గొల్లనపల్లి వద్ద గన్నవరం-ఆగెరెపల్లి ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆముదాలవలసతోపాటు జిల్లాలో పలు చోట్ల రహదారులు, పంటపొలాలు జలమయమయ్యాయి.ఖరీఫ్‌ సాగుకోసం విత్తనాలు వేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని