Harish rao: కొత్త వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: హరీశ్‌రావు
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈమేరకు హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రానున్న విద్యాసంవత్సరంలో కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్యకళాశాలలపై అధికారులతో హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో గతేడాది 8 వైద్యకళాశాలను ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామన్న ఆయన... ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా 9 కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్ధంగా ఉండాలన్న హరీశ్‌రావు... ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తొమ్మిది వైద్యకళాశాలలు ప్రారంభ లక్ష్యంతో ఇప్పటికే 87 మందికి పదోన్నతులు ఇచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు. 210మంది అసోసియేట్ ప్రొఫెసర్‌లకు వారం రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, త్వరలో ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసి 10రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలింగ్ నిర్వహించి 9 వైద్యకళాశాలల్లో వారిని నియమించాలని సూచించారు. కొత్త వైద్యకళాశాలల విషయమై సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అజయ్ కుమార్, పలు జిల్లా కలెక్టర్లతో హరీశ్ రావు మాట్లాడారు. వైద్యవిద్యార్థులకు అవసరమయ్యే హాస్టల్ వసతి సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, పరికరాలు సిద్ధం చేయాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మంత్రి కోరారు.
వైద్యకళాశాలల పనుల వేగవంతం కోసం ఈనెల 28న ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్లు, కళాశాలల ప్రిన్సిపల్స్, ఇంజనీర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న వారం రోజుల్లో కొత్త కళాశాలలను సందర్శించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్యవిద్యా సంచాలకులు రమేష్ రెడ్డిని హరీశ్‌రావు ఆదేశించారు. జులై, ఆగస్టు నాటికి కొత్త వైద్యవిద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమైతే తొమ్మిది జిల్లాల్లో విద్య, వైద్యం ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. ఈ ఏడాది 9 వైద్యకళాశాలలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుందని తెలిపారు. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690కి పెరుగుతుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!