Srinivas Goud: హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్డీని సస్పెండ్‌ చేశాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నగరంలోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు.

Updated : 13 Aug 2023 16:07 IST

హైదరాబాద్‌: నగరంలోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ఈ ఘటనపై విచారణ చేస్తున్నాం. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వదలం. ఫిర్యాదు వచ్చినా చర్యలు తీసుకుంటాం.. ఆ తర్వాత విచారణ చేస్తాం. హరికృష్ణ అనే అధికారిని సస్పెండ్ చేశాం. 2-3 రోజుల్లో విచారణ పూర్తిచేస్తాం. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవు. ఆదివారం ఉదయం 7 గంటలకు విషయం తెలిస్తే అప్పుడే చర్యలు చేపట్టాం’’ అని మంత్రి వెల్లడించారు.

నేను ఏ తప్పూ చేయలేదు: హరికృష్ణ

తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని.. వాటిని ఖండిస్తున్నట్లు హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్డీ హరికృష్ణ చెప్పారు. పత్రికలో వచ్చిన వార్తను చూసి తనపై సస్పెన్షన్‌ వేటు వేయడం సమంజసం కాదన్నారు. మీడియాలో తనపై చేసిన ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని.. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు