Hyderabad: జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం.. ఉత్సవాలకు రూ.15 కోట్లు: మంత్రి తలసాని
ఆషాడ జాతర బోనాలు జూన్ 22న గోల్కొండలో ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
హైదరాబాద్: ఆషాడంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూన్ 22న గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ మేరకు బేగంపేటలోని హరిత ప్లాజాలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఉత్సవాల తేదీలను ప్రకటించారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10న రంగం, 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఊరేగింపు, జూన్ 20న బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తారని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Pawan Kalyan: వారాహిపై ఈనెల 14 నుంచి పవన్ పర్యటన: నాదెండ్ల
-
India News
Germany Case: మూడేళ్ల ఆ పాప కోసం.. విదేశాంగ మంత్రికి సీఎం శిందే లేఖ
-
India News
Modi: అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
OTT తర్వాత థియేటర్లోకి.. ఇలా జరగడం ఇదే తొలిసారి
-
Crime News
Train accident: గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్ప్రెస్.. ఏడు బోగీలు బోల్తా