MLC Kavitha: మా దీక్షకు అనుమతివ్వండి.. డీజీపీకి కవిత విజ్ఞప్తి

ప్రభుత్వ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి జరుగుతున్న అన్యాయంపై తలపెట్టిన దీక్షకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. 

Published : 06 Mar 2024 20:38 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి జరుగుతున్న అన్యాయంపై తలపెట్టిన దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను భారాస ఎమ్మెల్సీ కవిత కోరారు. డీజీపీతో ఫోన్లో మాట్లాడిన ఆమె.. భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఎల్లుండే దీక్ష ఉన్నప్పటికీ ఇంకా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. జీవో నంబర్ 3 వల్ల జరిగే నష్టాన్ని తెలపాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుతంగానే తాము దీక్ష చేస్తామని, అనుమతి ఇవ్వాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని