MLC kavitha: సీబీఐ విచారణకు అనుమతి.. రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత

భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు అనుమతివ్వడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు.

Updated : 06 Apr 2024 19:27 IST

దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు అనుమతివ్వడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది నితీష్‌ రాణా కోర్టులో మెన్షన్‌ చేశారు. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. దీంతో ఈ నెల 10 వరకు సమయం ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి శుక్రవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని