SRH vs RR: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో రేపు జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా మెట్రో సర్వీసులను పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Published : 01 Apr 2023 17:51 IST

హైదరాబాద్‌: నగరంలో ఐపీఎల్‌ సందడి మొదలైంది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య 3.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. రద్దీ దృష్ట్యా నాగోల్‌-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మ్యాచ్‌ నేపథ్యంలో ప్రేక్షకుల కోసం నిర్వాహకులు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని