ఎక్కువ కాఫీ తాగితే.. గుండెకు ప్రమాదమే!

కాఫీ ఆరోగ్యానికి మంచిదా?కాదా..?అనే ప్రశ్నకు కొన్ని ఏళ్లుగా పరిశోధకులు సమాధానం వెతుకుతున్నారు. అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఒకసారి కాఫీ ఆరోగ్యానికి హానికరమని అంటే.. మరోసారి కాఫీ తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని

Updated : 20 Feb 2021 05:51 IST

తాజా నివేదికల్లో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా..?అనే ప్రశ్నకు కొన్ని ఏళ్లుగా పరిశోధకులు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. ఆ దిశగా ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కాఫీ ఆరోగ్యానికి హానికరమని ఓసారి.. కాఫీ తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని మరోసారి ఇలా పరిశోధన ఫలితాలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో మాత్రం కాఫీ ఎక్కువగా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని పరిశోధకులు తేల్చారు.

రోజులో ఆరు కప్పులు లేదా అంతకుమించి కాఫీ తాగిన వారికి గుండె సంబంధిత వ్యాధులు కచ్చితంగా వస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు తెలిపారు. చాలా కాలం నుంచి ప్రతిరోజూ ఆరు కప్పులకు మించి కాఫీ తాగుతున్న వారిలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక గుండె ప్రమాదంలో పడొచ్చని చెబుతున్నారు. కాఫీలో కఫెస్టోల్‌ అనే రసాయన మూలకం ఉంటుందని, అది రక్తంలో కొవ్వు స్థాయిని పెంచుతుందని పేర్కొన్నారు. ఫిల్టర్‌ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్‌ ఎక్కువగా ఉంటుందట. అందుకే కాఫీ తాగాల్సి వస్తే.. ఫిల్టర్‌ కాఫీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆరోగ్యంపై కాఫీ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇంకా అధ్యయనం కొనసాగిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీని తాగుతున్నారట. ఏడాదికి 1.79 కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని ఒక అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని