ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీ కనకమేడల విజ్ఞప్తి

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ‘భారతరత్న’ (Bharat Ratna) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కోరారు. 

Updated : 12 Feb 2024 18:46 IST

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ‘భారతరత్న’ (Bharat Ratna) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆయన లేఖలు రాశారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా ఎన్టీఆర్‌ నిలిచారని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని