విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్‌కు నోటీసులు: జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి

తెలంగాణలో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు.

Updated : 11 Jun 2024 15:07 IST

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ నరసింహారెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఈ అంశంలో కేసీఆర్‌, సురేశ్‌ చందా, అజయ్‌ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్‌ జులై 30 వరకు సమయం అడిగారని చెప్పారు. జూన్‌ 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపినట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని