రాధాకిషన్‌రావును కరీంనగర్‌ తరలించిన అధికారులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కరీంనగర్‌ తరలించారు.

Published : 21 Apr 2024 09:44 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కరీంనగర్‌ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్‌ ఇవ్వాలని ఆయన కోరగా.. కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా.. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఎస్కార్ట్‌ వాహనాలతో ఆదివారం ఉదయం రాధాకిషన్‌రావును తరలించారు. రెండు ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది, భోజనాలకు అయ్యే మొత్తం ఖర్చు రూ.18వేలను ఆయన చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు