Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పోలీసుల దర్యాప్తు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Updated : 23 Feb 2024 10:28 IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. డ్రైవర్‌ నిద్రమత్తు, వేగమే ప్రమాదానికి కారణమై ఉంచొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఆమె ప్రయాణించిన కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు