Uppal Match: ఉప్పల్‌ మ్యాచ్‌.. ప్రేక్షకులు వీటిని తీసుకురావొద్దు : పోలీస్‌ కమిషనర్‌

ఉప్పల్‌ మ్యాచ్‌ కోసం 2,500 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు.

Updated : 26 Mar 2024 18:11 IST

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ కోసం 2,500 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. బుధవారం రాత్రి  ముంబయి ఇండియన్స్‌- సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీటింగ్‌ సామర్థ్యం 39 వేలు ఉందని, స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసులను మోహరిస్తామని తెలిపారు.

ల్యాప్‌ ట్యాప్‌, వాటర్‌ బాటిల్స్‌, బ్యానర్స్‌, లైటర్స్‌, సిగరెట్స్‌, బైనాక్యులర్స్‌పై నిషేధమని, స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని స్పష్టం చేశారు. బ్లూటూత్స్ అనుమతిస్తామన్నారు. స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్‌ నిఘా ఉంటుందన్నారు. మ్యాచ్‌కి 3గంటల ముందు నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. నాలుగు అంబులెన్స్‌లు, మెడికల్‌ టీమ్స్‌, ఫైర్‌ ఇంజిన్లను సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. టికెట్‌ కొనుగోలు చేసిన వారి కోసం పార్కింగ్‌ సదుపాయం కల్పించామన్నారు. స్టేడియం వద్ద బ్లాక్‌ టికెట్స్‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మ్యాచ్‌ నిర్వహణ కోసం పోలీస్‌ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీపీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని