Rain: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం

నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

Updated : 20 Apr 2024 11:34 IST

హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్‌, తుర్కయాంజల్‌,  కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్‌, అడిక్‌మెట్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, తార్నాక, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, మెహదీపట్నం, మాసబ్‌ ట్యాంక్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు