Chandrababu arrest: సెలవుపై రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌.. బాబు భద్రతపై ఆందోళన

రాజమహేంద్రవరం సెంట్రల్  జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. దీంతో చంద్రబాబు భద్రతపై  తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 14 Sep 2023 18:49 IST

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సెంట్రల్  జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్‌ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్‌ భార్యను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

మరో వైపు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన భద్రతపై కుటుంబ సభ్యులతో పాటు తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో రాజమహేంద్రవరం సెంట్రల్  జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జైలు సూపరింటెండెంట్‌ను మారుస్తారని గత కొన్ని రోజులుగా తెదేపా నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని