Ramoji Rao: దివికేగిన అక్షర సూరీడు.. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు.

Updated : 09 Jun 2024 17:39 IST

హైదరాబాద్‌: అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ నిప్పంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల ‘జోహార్‌ రామోజీరావు’ నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.

అంత్యక్రియల్లో తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు హాజరయ్యారు. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్‌, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము, పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని