TS News: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామాపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌

TSPSC ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి రాజీనామాపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఆకునూరి మురళీ స్పందించారు.

Published : 11 Dec 2023 22:50 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ఛైర్మన్‌గా జనార్దన్‌ రెడ్డి రాజీనామాపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ (RS Praveen Kumar) స్పందించారు. జనార్దన్‌ రెడ్డి రాజీనామాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా టీఎస్‌పీఎస్సీ సభ్యులూ రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘‘ఈ పని మార్చి నెలలోనే చేసి ఉండే బాగుండె. అసలు నిజాలు ప్రజలకు తెలిసేవి. ప్రవళిక లాంటి నిరుద్యోగుల విలువైన ప్రాణాలు పోయేవి కావు. అదే విధంగా సిట్ (SIT) ఇన్వెస్టిగేషన్ అంతా అసలు నిందితులను రక్షించడానికే జరిగింది. దాని మీద కూడా పూర్తి స్థాయి సమీక్ష జరపాలని నిరుద్యోగుల తరపున బీఎస్పీ కోరుతోంది. ఈ సారైనా నీతికి, నిజాయితీకి, చక్కటి పరిపాలన దక్షతకు మారుపేరైన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా సభ్యులుగా నియమించగలరు’’ అని పేర్కొన్నారు. 

TSPSC ఛైర్మన్‌ రాజీనామా.. సీఎం రేవంత్‌ను కలిసిన కాసేపట్లోనే..!

మిగతా సభ్యులూ రాజీనామా చేయాలి: ఆకునూరి మురళి

అలాగే, ఇదే అంశంపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ సైతం స్పందించారు. బాధ్యతగా రాజీనామా చేసిన జనార్దన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మిగతా సభ్యులు సైతం రాజీనామా చేయాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. రాజీనామా చేసి తెలంగాణ నిరుద్యోగులకు నమ్మకం కలిగించాలన్నారు. రాజకీయాలకు సంబధంలేని, నిజాయతీ కలిగిన ఐఏఎస్‌/ఐపీఎస్‌/ఐఎఫ్‌ఎస్‌/విశ్రాంత హైకోర్టు జడ్జిలను కొత్త కమిషన్‌ సభ్యులుగా నియమిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని