Ap elections: కడప గౌస్‌నగర్‌ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం

పోలింగ్‌ రోజున కడప గౌస్‌నగర్‌లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 18 May 2024 17:30 IST

కడప: పోలింగ్‌ రోజున కడప గౌస్‌నగర్‌లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సీఐ, ఐదుగురు ఎస్‌ఐలకు ఛార్జ్‌ మెమో జారీ జారీ చేశారు. కడప వన్‌టౌన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు రంగస్వామి, తిరుపాల్‌ నాయక్‌, మహమ్మద్‌ రఫీ, ఎర్రన్న, అలీఖాన్‌కు ఛార్జ్‌ మెమోలు పంపించారు. వీరందరిపైనా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మే 13వ తేదీన కడప నగరంలోని గౌస్‌నగర్‌లో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడేలా వైకాపా కార్యకర్తలను మంత్రి అంజద్‌బాషా కుటుంబ సభ్యులు రెచ్చగొడుతూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరినీ నిలువరించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆ రోజు విధుల్లో ఉన్న అధికారులందరికీ ఛార్జి మెమోలు దాఖలు చేశారు. కౌంటింగ్‌ రోజున కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులను ఎస్పీ ఆదేశించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు