Sri Rama Navami: భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్‌

శ్రీరామ నవమి (Sri Rama Navami)ని పురస్కరించుకుని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Published : 17 Apr 2024 11:36 IST

భద్రాచలం: శ్రీరామ నవమి (Sri Rama Navami)ని పురస్కరించుకుని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మిథిలా మైదానంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం వీధులు మార్మోగుతున్నాయి. కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని