Andhra news: ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్‌ ..ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వం

రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. 

Updated : 17 May 2024 21:21 IST

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్‌ విచారణ జరపనుంది. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. 

సిట్‌ సభ్యులు వీరే..

  • రమాదేవి, ఎస్పీ, ఏసీబీ
  • సౌమ్యలత, అదనపు ఎస్పీ, ఏసీబీ
  • రమణమూర్తి, డీఎస్పీ, ఏసీబీ-శ్రీకాకుళం
  • పి. శ్రీనివాసులు, డీఎస్పీ, సీఐడీ
  • వల్లూరి శ్రీనివాసరావు, డీఎస్పీ, ఏసీబీ-ఒంగోలు
  • రవి మనోహర ఆచారి, డీఎస్పీ, ఏసీబీ-తిరుపతి
  • వి.భూషణం- ఇన్‌స్పెక్టర్‌, గుంటూరు రేంజ్‌
  • కె.వెంకటరావు- ఇన్‌స్పెక్టర్‌ ఇంటెలిజెన్స్‌, విశాఖ
  • రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్‌, ఏసీబీ
  • జి.ఐ.శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ
  • మోయిన్‌, ఇన్‌స్పెక్టర్‌ ఒంగోలు
  • ఎన్‌.ప్రభాకర్‌ - ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ, అనంతపురం
  • శివప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని