Tenali: వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్‌

తెనాలి వైకాపా ఎమ్మెల్యే శివకుమార్‌ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్‌ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు.

Updated : 17 May 2024 16:42 IST

గుంటూరు: తెనాలి వైకాపా ఎమ్మెల్యే శివకుమార్‌ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్‌ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. కోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులకు వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. దాడి తర్వాత ఎమ్మెల్యపై కేసు పెట్టారు కానీ, చర్యలు తీసుకోలేదన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈనెల 13న క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్‌ అనే ఓటరుపై ఎమ్మెల్యే, అతని అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని