Supreme Court: ఫైబర్‌ నెట్‌ కేసు.. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలి: సుప్రీంకోర్టు

ఫైబర్‌నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది.

Updated : 12 Dec 2023 18:48 IST

దిల్లీ: ఫైబర్‌ నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబును ధర్మాసనం ఆదేశించింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.

కేసు విషయాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. జైలుకు పంపిన విషయాలపైనా ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ కేసుపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.

అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరఫునే దిల్లీ సహా పలు ప్రదేశాల్లో అదనపు ఏజీ, సీఐడీ డీజీ మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. వారు ప్రెస్‌మీట్‌ నిర్వహించడం పూర్తిగా తప్పు అని చెప్పారు. మీడియా సమావేశాల్లో నిరాధార ఆరోపణలు చేశారని.. వాటితో పోలిస్తే చంద్రబాబు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని