Andhra news: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగి.. ఈసీ తొలి వేటు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది.

Published : 17 Mar 2024 16:58 IST

అమరావతి: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది. అధికార వైకాపా నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వోను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ జరిపించి.. వీఆర్వో రమేష్‌ రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధరణ కావడంతో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు శాఖపరంగానూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని