Tarakaratna: తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు: లక్ష్మీనారాయణ
బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తెలుగు సినీనటుడు తారకరత్నకు చికిత్సను కొనసాగుతోంది. పరిస్థితిని బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.
బెంగళూరు: బెంగళూరులోని నారాయణ హృదయాలయ(Narayana Hrudayalaya) ఆసుపత్రిలో తెలుగు సినీనటుడు తారకరత్న(Tarakaratna)కు చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం తెదేపా హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ ఆసుపత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇవాళ తారకరత్న మెదడు స్కానింగ్ తీశారు. వచ్చే నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుంది. పరిస్థితిని బట్టి విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు’’ అని లక్ష్మీనారాయణ తెలిపారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.
నందమూరి తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని హిందూపురానికి చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలు పూజలు నిర్వహించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోని వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తూ 101 కొబ్బరికాయలు కొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: భాజపా నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్ రెడ్డి
-
World News
Planes Collide: తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి..!
-
Movies News
Taman: ఆంధ్రప్రదేశ్లో స్టూడియో పెట్టాలనుకుంటున్నా: సంగీత దర్శకుడు తమన్
-
Education News
JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ (సెషన్ 2) అడ్మిట్ కార్డులు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Priyanka Gandhi: గాంధీ కుటుంబాన్ని BJP నిత్యం అవమానిస్తోంది : ప్రియాంక