Chinarajappa: తెదేపా ఎమ్మెల్యే చినరాజప్పకు తప్పిన ప్రమాదం

తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

Updated : 24 Feb 2024 21:20 IST

పెద్దాపురం: తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తెదేపా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో శనివారం పెద్దాపురంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అకస్మాత్తుగా కారుకు ఓ వ్యక్తి అడ్డురావడంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో చినరాజప్ప కారులోనే ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు కారును డివైడర్‌ పైనుంచి కిందకు దించారు. పెద్దాపురం నియోజకవర్గానికి తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చినరాజప్పను ఇవాళ చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని