TDP: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త యశస్వి

తెదేపా (TDP) ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్‌) తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరయ్యారు.

Updated : 11 Jan 2024 18:23 IST

తిరుపతి: తెదేపా (TDP) ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్‌) తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వృత్తిరీత్యా యష్‌ అమెరికాలో ఉన్నారు. గతేడాది డిసెంబర్‌ 23న తల్లి ఆరోగ్యం బాగాలేదని భారత్‌కు రావడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. నాలుగు గంటల తర్వాత 41ఏ నోటీసు ఇచ్చి యశస్విని విడిచిపెట్టారు. ఇవాళ సీఐడీ విచారణ కోసం తిరుపతి వచ్చారు. ఆయనకు మద్దతుగా పలువురు తెదేపా నేతలు అక్కడికి చేరుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని